మనుబోలులోని సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమవుతాయని ఆర్చకులు సాయికుమార్ శర్మ తెలిపారు. ఏప్రిల్ 9న త్రిశూలేశ్వరుడు పయనం, ధ్వజారోహణంతో మొదలై, 18న శాంతి ఉత్సవంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాలలో చప్పరసేవ, రావణసేవ, నందిసేవ, రథోత్సవం, కల్యాణం, వసంతోత్సవం, పారు వేట, ఏకాంతసేవ వంటి కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి సంగమేశ్వరుని కృపా కటాక్షాలు పొందాలని కోరారు.