మనుబోలు: 12న షర్మిల అక్కంపేటకు రాక

524చూసినవారు
మనుబోలు: 12న షర్మిల అక్కంపేటకు రాక
పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఈ నెల 12వ తేదీన మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి రానున్నారు. ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం మార్చడాన్ని నిరసిస్తూ, రచ్చబండ కార్యక్రమం ద్వారా కూలీల సమస్యలను తెలుసుకునేందుకు ఆమె వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బళ్ల హరి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై షర్మిల నిరసన తెలపనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు అల్లూరు రమణయ్య, కృపానందం, వెంకటేశ్వర్లు, లెనిన్ బాబు పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్