అమరావతి స్కూల్ ను సందర్శించిన ఒలింపియాడ్ ఫౌండర్ శాస్త్రి

434చూసినవారు
అమరావతి స్కూల్ ను సందర్శించిన ఒలింపియాడ్ ఫౌండర్ శాస్త్రి
పొదలకూరులోని అమరావతి స్కూల్ ను ఈ అబ్యాస్ ఒలింపియాడ్ ఫౌండర్ డాక్టర్ భువనగిరి ఫణి పవన్ శాస్త్రి గురువారం  సందర్శించారు. ఆయన చిన్నారులతో సమావేశమై, భవిష్యత్తులో విజయాలు సాధించడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై పలు విషయాలను క్లుప్తంగా వివరించారు. అమరావతి స్కూల్ అధినేత సురేష్ మాట్లాడుతూ, ఇంతటి గొప్ప వ్యక్తి తమ పాఠశాలకు రావడం, వారితో సమయం గడపడం మరిచిపోలేని అనుభూతి అని, అమరావతి పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు, అమరావతి విద్యాసంస్థ శ్రేయబిలాషులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్