సర్వేపల్లిలో పండగలా పీ4 వార్షికోత్సవం

80చూసినవారు
సర్వేపల్లిలో పండగలా పీ4 వార్షికోత్సవం
సర్వేపల్లి నియోజకవర్గంలో పీ4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముత్తుకూరులో సోమవారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ, రూ. 54.75 కోట్లతో అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని తెలిపారు. వివిధ కంపెనీలు సీఎస్ఆర్ నిధులతో గిరిజన కాలనీల అభివృద్ధికి తోడ్పడుతున్నాయని, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్