
బస్సులో సీటు కోసం మహిళల గొడవ (వీడియో)
AP: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. కదిరి నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు కలిసి ఓ వృద్ధురాలిని కొట్టారు. దాంతో వృద్ధురాలు బస్సు ముందు కూర్చొని ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవ సర్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.




