మనుబోలు మండలం మడమనూరు సమీపంలో ఆదివారం రాత్రి మద్యం దుకాణం క్యాషియర్ పై దారిదోపిడీ జరిగింది. స్వగ్రామానికి మోటార్ సైకిల్ పై వెళ్తున్న క్యాషియర్ ను రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు అడ్డగించి, కళ్లల్లో కారం కొట్టి అతని వద్ద ఉన్న రూ.3 లక్షల నగదును అపహరించుకెళ్లారు. ఈ ఘటనతో బాధితుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.