సర్వేపల్లి నియోజకవర్గంలో హౌసింగ్ శాఖలో రూ. 3 వేల కోట్లకు పైగా భారీ కుంభకోణం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో శనివారం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, నాసిరకంగా కట్టిన ఇళ్లలో పేదలు నివాసం ఉండటం దినదిన గండంగా మారిందని ఆయన అన్నారు. ఈ కుంభకోణంపై సిట్ విచారణ జరిపించి, దోపిడీదారుల నుంచి ప్రతి రూపాయిని వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.