ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్‌కు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో తమిళనాడుకు చెందిన ఫిషింగ్ బోటును మత్స్యశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బోటుతో పాటు సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన చేపలను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని, మత్స్యకారులను జువ్వాలదిన్నె హార్బర్‌కు తరలించారు. ఈ ఘటనపై వివరాలను మత్స్యశాఖ సహాయ సంచాలకులు చాంద్ భాషా వెల్లడించారు.