సర్వేపల్లి సమగ్ర అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి

524చూసినవారు
సర్వేపల్లి సమగ్ర అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి
స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పొదలకూరులో 37 స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, చెత్తను నిర్ణీత ప్రదేశాల్లో వేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, తల్లికి వందనం పథకం ద్వారా గిరిజన పిల్లల విద్యాభ్యాసం పెరిగిందని తెలిపారు. గత వైసీపీ పాలనలో ఆపేసిన అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్