ముత్తుకూరు మండల కేంద్రంలోని హెచ్పి పెట్రోల్ బంక్ ఎదుట ట్రాక్టర్ - వాటర్ ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.