బీఈడీ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలపై వీసీ ఆకస్మిక తనిఖీ

387చూసినవారు
బీఈడీ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలపై వీసీ ఆకస్మిక తనిఖీ
నెల్లూరు నగరంలోని ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్‌లో నిర్వహిస్తున్న బీఈడీ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాన్ని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఈడీ నాలుగో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణను పరిశీలించిన ఆయన, విద్యార్థుల ప్రాక్టికల్ రికార్డులు, టీచింగ్ ప్రాక్టీస్ విధానాన్ని సమీక్షించారు. బోధనా నైపుణ్యాలను ప్రత్యక్షంగా గమనించిన వీసీ, పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్