పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వెంకటాచలం మండలం పూడిపర్తి జెడ్పీ హైస్కూలు
విద్యార్థులు కె. జస్వంత్ (591), కె. చందన (589), కె. సుశ్వాని (587)లను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ సోమవారం అభినందించారు. పేద కుటుంబాల నుంచి వచ్చి ప్రతిభ చాటడం అభినందనీయమని, ట్రిపుల్ ఐటీలో క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.