దత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ వెంగమాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ చైర్మన్ ముసలయ్య ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం నిలుపు, పసుపు దంచు కార్యక్రమాలతో ప్రారంభమై, సోమ, మంగళవారాల్లో రథోత్సవాలు, బుధవారం కల్యాణోత్సవం, గురువారం పొంగళ్ల కార్యక్రమం, ఎడ్ల ప్రదర్శన జరగనున్నాయి. జూలై 23న 16 రోజుల పండుగ, ఆగస్టు 6న నెల పొంగళ్లు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు.