నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటుకూరు గ్రామ సమీపంలో చెట్ల మధ్య ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడు జలదంకి మండలం సోమవరప్పాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.