దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఇటీవల మరణించిన గుండ్రా మాల్యాద్రి కుటుంబ సభ్యులకు బీసీ నాయకులు బుధవారం ఉదయం అందజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గ్రామంలోని అనేక మందికి చెక్కులు మంజూరవడం సంతోషాన్ని కలిగిస్తుందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పాముల సుబ్బారాయుడు, తెలుగుయువత అధ్యక్షులు పాముల మహేష్ , బీసీ సెల్ మాలకొండయ్య మోడీ , బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గువ్వల ఆదినారాయణ పాల్గొన్నారు.