సహకార వారోత్సవాలు ఘనంగా ప్రారంభం: రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు

250చూసినవారు
సహకార వారోత్సవాలు ఘనంగా ప్రారంభం: రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరిలోని సీతారామపురం మండలంలోని మారం రెడ్డి పల్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రెసిడెంట్ సోమన బోయిన రాజశేఖర్ జెండా ఆవిష్కరించి, మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంప్యూటరీకరణతో రైతులకు రుణాలు, వడ్డీ వివరాలు క్షణాల్లో తెలుస్తాయని ఆయన తెలిపారు. సొసైటీ సీఈఓ సంకతాల శ్రీనివాసులు, సిబ్బంది, మండల రైతులు పాల్గొన్నారు. తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్న సొసైటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. సహకార స్ఫూర్తితో రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్