సెప్టెంబర్ 29న రామాపురంలో జరగనున్న పల్లె పండుగ 3. 0 కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, సమన్వయంపై చర్చించేందుకు సెప్టెంబర్ 24న వింజమూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మండలాల ప్రతినిధులు పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, కలిగిరి మండలాల ప్రతినిధులతో సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు మర్రిపాడు, సీతారామపురం, వరికుంటపాడు, కొండాపురం మండలాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.