వీధి దీపాలు లేక సింగారెడ్డిపల్లి వాసుల ఆందోళన

245చూసినవారు
వీధి దీపాలు లేక సింగారెడ్డిపల్లి వాసుల ఆందోళన
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి బీసీ కాలనీలో గత నెల రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా 'వేస్తాం' అనే సమాధానమే వస్తోందని, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని వారు మండిపడుతున్నారు. చీకటి కారణంగా రాత్రివేళల్లో భయం భయంగా గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.