ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ రామచంద్రపురం గ్రామంలో పేద చిన్నారులు, అనాథలు, సెమీ ఆర్ఫన్ పిల్లలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బ్రదర్ పి. ఎడ్వర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాషువా డానియల్ మహిమా వర్షిప్ నిర్వాహకులతో పాటు బ్రదర్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవసరంలో ఉన్న చిన్నారులకు బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. గత రెండేళ్లుగా ఫౌండేషన్ ద్వారా పేదలు, అనాథలు, సెమీ ఆర్ఫన్ పిల్లలు, నిరుపేద కుటుంబాలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ యేసుక్రీస్తు ప్రేమను పంచడమే తమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని బ్రదర్ పి. ఎడ్వర్డ్ పేర్కొన్నారు.