దుత్తలూరు: నర్రవాడలో జనార్ధన స్వామి రథోత్సవం

250చూసినవారు
దుత్తలూరు: నర్రవాడలో జనార్ధన స్వామి రథోత్సవం
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని నర్రవాడలో వెలసిన శ్రీశ్రీదేవి భూదేవి సమేత శ్రీజనార్ధన స్వామి వారి దేవస్థాన ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం, గ్రామ పురవీధుల మీదుగా రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్