ఆ మండలంలో పనుల కోసం వెళ్ళినా అధికారులు స్పందించరా ?

6చూసినవారు
ఆ మండలంలో పనుల కోసం వెళ్ళినా అధికారులు స్పందించరా ?
వింజమూరు మండలంలోని తహసీల్దారు కార్యాలయంలో ప్రజలు పనులు కోసం పదే పదే కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. ఈ కార్యాలయంలో ఒక పని జరగాలంటే నెలల వ్యవధి సమయం పడుతుంది. ఎందుకు ఇంత ఆలస్యం అని ప్రజలు అధికారులను నిలదీస్తే మాకు కాలీ లేదు అంటూ త్రోసి పుచ్చుతున్నారు. ప్రజలు కార్యాలయం చుట్టూ తిరిగి అనారోగ్యాల బారిన పడుతున్నారు. పనులు త్వరితగతిన చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్