ఎమ్మెల్సీ బీదను కలిసిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే దంపతులు

121చూసినవారు
ఎమ్మెల్సీ బీదను కలిసిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే దంపతులు
టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రను ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి దంపతులు మాగుంట లేఅవుట్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 1న నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్రను మేకపాటి దంపతులు ఆహ్వానించారు. ఈ భేటీలో రాజకీయ పరిణామాలు, జిల్లా అభివృద్ధి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్