దుత్తలూరు మండలం నందిపాడులోని దిద్దేరికుంట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అటవీ అధికారులకు సమాచారం అందడంతో అటవీ, పోలీస్ అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామానికి చెందిన లక్ష్మయ్య దంపతులు చీపురు పుల్లల కోసం అడవిలోకి వెళ్లినప్పుడు పులి ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. అయితే అధికారులు పరిసర ప్రాంతాలను పరిశీలించినా ఎటువంటి ఆనవాళ్లు లభించలేదని సమాచారం.