జలదంకి: అంత్యక్రియలకు వచ్చి వెళుతుండగా ప్రమాదం

2944చూసినవారు
జలదంకి: అంత్యక్రియలకు వచ్చి వెళుతుండగా ప్రమాదం
సోమవారం జలదంకి మండలం చిన్న క్రాక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ పంచర్ కావడంతో కల్వర్టును ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన రమేష్ కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.