కలిగిరి: కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి

278చూసినవారు
నెల్లూరు జిల్లా, కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెంలో గొర్రెల కొట్టంలోకి చొరబడిన కుక్కలు 25 గొర్రె పిల్లలను చంపివేశాయి. రెండు పెద్ద గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో రైతు బొమ్మిరెడ్డి చిరరెడ్డి సుమారు రూ. 1,50,000 నష్టం వాటిల్లిందని వాపోయారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్