కలిగిరి మండలం అయ్యప్పరెడ్డిపాలెం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్దూరు శ్రీనివాసరావు (50) అనే వంట మాస్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. జలదంకి నుంచి ఇంటికి బైకుపై వెళ్తున్న శ్రీనివాసరావు, కావలి వైపు వస్తున్న ఉప్పల శీనయ్య (40) బైకులతో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో శీనయ్య తీవ్రంగా గాయపడ్డారు.