కొండాపురం: ఉధృతంగా ప్రవహిస్తున్న ఉప్పుటేరు వాగు

3033చూసినవారు
కొండాపురం-రేణమాల మధ్య ఉన్న ఉప్పుటేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులో నీటి ప్రవాహం 2 అడుగుల ఎత్తున రహదారిపైకి చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులో ప్రవాహం పెరిగినట్లు సమాచారం అందడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాగు దాటే ప్రయత్నం చేయవద్దని వాహనదారులను హెచ్చరించారు.