జలదంకి సాయి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ బి. అయ్యాల రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 29 జూన్ 2026 ఉదయం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఇండో సోలార్, ఫాక్స్‌కాన్, హీరో మోటోకార్ప్, డైకిన్ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 17,000 నుంచి రూ. 21,000 వరకు జీతం ఉంటుందని తెలిపారు.