రాధాకృష్ణపై మేకపాటి ఫైర్… క్షమాపణలు చెప్పాలంటూ హెచ్చరిక

310చూసినవారు
ఉదయగిరి వైఎస్ఆర్‌సీపీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఏబీఎన్ రాధాకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. సాధారణ స్థాయి నుంచి వచ్చి వందల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలపై అనుచితంగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే మహిళల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్