కలిగిరి మండలం నాగసముద్రం బీసీ కాలనీకి చెందిన చిన్నయ్య మార్కాపురం వద్ద జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో మృతి చెందాడు. శనివారం మృతదేహం గ్రామానికి చేరుకోగా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయినప్పటికీ, చిన్నయ్య కుమార్తె వైష్ణవి తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నేతాజీ పాఠశాలలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షకు హాజరైంది. తండ్రిని కోల్పోయిన విషాదంలోనూ ఆమె చూపిన ధైర్యసాహసాలు గ్రామస్తులను కదిలించాయి.