కలగిరి సమీపంలోని హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ముందు వెళ్తున్న టీవీఎస్ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడు చేజర్ల మండలం పిల్లేరుకు చెందిన తమ్మినేని శంకరయ్యగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.