కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మరణించినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో కొందరు నిద్రలోనే సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటనలో నెల్లూరు, వింజమూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, గోళ రమేష్ (35), గోళ అనూష (32), గోళ యశ్వంత్ (8), గోళ మన్వితా(6) మృతి చెందారు. దీంతో గోళ్లవారిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.