దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. చిన్నారులకు రెండు చుక్కల పోలియో చుక్కలు వేయడం ద్వారా వారి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు పాల్గొని కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు పోలియో నివారణపై అవగాహన కల్పిస్తూ చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రి తప్పకుండా టీకా వేయించాలని సూచించారు.