వరికుంటపాడులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

5చూసినవారు
వరికుంటపాడులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
వరికుంటపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయగిరి నుంచి తిమ్మారెడ్డిపల్లి వైపు చేపల లోడుతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ఆటో అదుపుతప్పడమే కారణంగా భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్