ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మెన్‌గా మేకపాటి శాంతి కుమారి ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ సెక్రటరీ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి NMD ఫరూక్, రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్‌లు, మాజీ ఎమ్మెల్యే, కూటమి నేతలు కూడా పాల్గొని శాంతి కుమారిని అభినందించారు.