జోనల్ క్రికెట్ టోర్నీలో సీతారామ కళాశాల జట్టు ఘన విజయం

10చూసినవారు
జోనల్ క్రికెట్ టోర్నీలో సీతారామ కళాశాల జట్టు ఘన విజయం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బుధవారం విక్రమ సింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన జోనల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో సీతారామ డిగ్రీ కళాశాల విద్యార్థులు విజేతగా నిలిచారు. ఉదయగిరి ఎంఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల జట్టుతో జరిగిన హోరాహోరీ పోరులో సీతారామ కళాశాల జట్టు అద్భుతమైన ప్రతిభ కనబరిచి గెలుపును సొంతం చేసుకుంది. ఆటగాళ్ల సమన్వయం, పట్టుదల ఈ విజయానికి కారణమయ్యాయి. ఈ గెలుపు పట్ల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ విజేతలను అభినందించారు.

సంబంధిత పోస్ట్