నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని ఘటిక సిద్ధేశ్వరంలో శరన్నవరాత్రులు అద్భుతంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పూజల్లో పాల్గొని, ప్రసాదాలు స్వీకరించి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కోసం నిత్య అన్నదానం కూడా నిర్వహించారు.