వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన దేవరకొండ గోవిందులు (47) హత్య కేసును ఉదయగిరి పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా నిమ్మతోటలో గోవిందులను హత్య చేసి, మృతదేహాన్ని గోతం సంచిలో కట్టి దుత్తలూరు మండలం బండకిందపల్లి అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఉదయగిరి మండలం దాసరపల్లికి చెందిన షేక్ జలీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన గడ్డపార, బైక్, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.