వింజమూరు మండల
టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మండల కన్వీనర్, మాజీ సొసైటీ చైర్మన్ గొంగటి రఘునాథ రెడ్డి మృతి పట్ల ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వింజమూరులోని ఆయన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే, పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
టీడీపీ బలోపేతానికి రఘునాథ రెడ్డి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి పార్టీకి, వింజమూరు ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.