ఉదయగిరి తహశీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పనుల నిమిత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పనిచేసిన తహశీల్దార్ పదోన్నతిపై బదిలీ కాగా, ఆయన స్థానంలో వచ్చిన కొత్త అధికారి విధుల్లో చేరకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజల పనులు ముందుకు సాగడం లేదు.