ఉదయగిరిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ

0చూసినవారు
ఉదయగిరిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ
ఉదయగిరిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను బుధవారం ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సుల భద్రతతో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కల్పిస్తున్న వసతులపై అధికారులతో చర్చించి, ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఆర్‌ఓ వెంకటరెడ్డి, తహశీల్దార్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్