వింజమూరు మండలంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా శుక్రవారం కూటమి నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకత్వంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. కేక్ కట్ చేసి, ప్రజలకు మిఠాయిలు పంచుతూ విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.