ఉదయగిరి: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో వృద్ధుడు మృతి

855చూసినవారు
ఉదయగిరి: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో వృద్ధుడు మృతి
శుక్రవారం ఉదయగిరి మండల పరిధిలోని బూదవాడ వద్ద 565 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట్రావుపల్లికి చెందిన చిన్నరామయ్య(67) మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టి, మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. మృతుడు మతి స్థిమితం లేక రోడ్ల వెంట తిరుగుతుంటాడని సమాచారం.

సంబంధిత పోస్ట్