ఉదయగిరి: గన్నేపల్లి హైవే ప్రమాదంలో వ్యక్తి గాయపడ్డాడు

450చూసినవారు
ఉదయగిరి: గన్నేపల్లి హైవే ప్రమాదంలో వ్యక్తి గాయపడ్డాడు
ఉదయగిరి మండలం గన్నేపల్లి హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణంపల్లికి చెందిన కాటిబోయిన వెంకటేశ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. హైవేపై వెళ్తున్న బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, వెంకటేశ్‌ను ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్