గురువారం ఉదయగిరి పట్టణంలోని మెయిన్, నాగుల భావి పాఠశాలలను ఎంఈఓ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. జిఎఫ్‌ఎల్‌ఎన్ 75 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, సూచనలు, సలహాలు అందించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. హోలీ స్టిక్స్ కార్డ్స్, పాఠశాల అవసరాలు వంటి అంశాలను సందర్శన ఫార్మేట్లో నమోదు చేశారు.