ఉదయగిరి పట్టణంలో మంగళవారం బిజెపి నాయకులు వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వాల్మీకి అడుగుజాడల్లో నడవాలని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సంస్కృత సాహిత్యంలో ఆదికవిగా, రామాయణ మహాకావ్యం రచయితగా వాల్మీకి చేసిన సేవలను కొనియాడారు. శ్లోక ప్రక్రియను కనిపెట్టడం ద్వారా కవిత్వ రంగానికి ఆయన చేసిన సేవలు ఆయనను గొప్ప ఋషిగా, కవిగా నిలబెట్టాయని తెలిపారు.