వరికుంటపాడు మండలంలోని ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకం పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 2018లో ప్రారంభమైన పనులు నేటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 2019లో పూర్తి చేయాల్సి ఉండగా అధికారులు ఆ దిశ గా చర్యలు చేపట్టకపోవడం దారుణం అను ప్రజలు మండిపడుతున్నారు. దీంతో లక్షల వెచ్చించి నిర్మించిన మదర్ ప్లాంట్ తో పాటు మినీ వాటర్ ట్యాంకులు కూడా నిరూపయోగంగా మారాయి.