మార్కాపురం బస్ అగ్ని ప్రమాదంలో మరణించిన కలిగిరి మండలం ఆత్మకూరు చిన్నయ్య కుటుంబానికి జనసేన పార్టీ తరపున రూ. 50,000 తక్షణ సహాయం అందించారు. ఐదుగురు ఆడపిల్లలున్న ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జనసేన నాయకులు హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.