దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 5 నుంచి 9వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. జూలై 5న నిలుపు, పసుపు దంచు కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 6, 7 తేదీల్లో రథోత్సవాలు, 8న పగలు కళ్యాణోత్సవం, పసుపు కుంకుమ ఉత్సవం, రాత్రి ప్రధానోత్సవం జరుగుతుంది. 9న పొంగళ్ళు, ఎడ్ల ప్రదర్శనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.