MLHP ఏ.అఖిలపై గ్రామస్థుల ఫిర్యాదు, వైద్యుడి విచారణ

186చూసినవారు
MLHP ఏ.అఖిలపై గ్రామస్థుల ఫిర్యాదు, వైద్యుడి విచారణ
వింజమూరు (M) శంఖవరం విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పనిచేసే MLHP ఏ.అఖిలపై ఇటీవల గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చాకలికొండ PHC వైద్యాధికారి మురళీకృష్ణ విచారణ చేపట్టారు. శంఖవరం గ్రామానికి చెందిన భూమిరెడ్డి లక్ష్మీదేవి కూతురు పిల్లలకు టీకాలు వేయించే విషయంలో MLHP తో వివాదం తలెత్తినట్లు తెలిసింది. ఈ ఘటనపై విచారణ జరిపి, నివేదికను జిల్లా వైద్యాధికారికి పంపినట్లు వైద్యుడు మురళీకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్